హైదరాబాద్, మహా : తెలంగాణలో ప్రజాపాలన నడవడం లేదని, రజాకార్ పాలన నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ధ్వజమెత్తారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నిర్ణయం తీసుకునే ముందు ఓవైసీని అడిగిన తర్వాతే సీఎం రేవంత్‌రెడ్డి తీసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ పరిపాలన ఓవైసీ చేతుల్లో ఉందా ? అంటూ ప్రశ్నించారు. ప్రజల కోసం కాదు…ఓవైసీ కోసం ప్రభుత్వం నడుస్తోందా ?’ అని నిలదీశారు. తెలంగాణలో ప్రభుత్వం ఎవరిది?, కాంగ్రెస్‌దా.. లేక ఓవైసీదా? అని ట్వీట్ చేశారు.
గాంధీ సరోవర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారీ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి మూసీ పరివాహక ప్రాంతాలలోని అనుమతి ఉన్న అపార్ట్ మెంట్లు, కట్టడాలను కూల్చాలన్న నిర్ణయం తీసుకోవడం, ఇందుకు యోవైసీ తమకు సమ్మతమేనని చెప్పడం తదితర పరిణామాల నేపథ్యంలో రాంచందర్ రావు తీవ్రంగా స్పందించారు. కూల్చడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఎంఐఎం నేతల అక్రమ నిర్మాణాలను కూల్చాలని డిమాండ్ చేశారు.







