- భర్తతో హీరోయిన్ హన్సిక డివోర్స్
- సోహైల్ తో నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
- గత కొన్నాళ్ళుగా విడివిడిగా ఉంటున్న హన్సిక, సోహైల్
ముంబై, మహా : టాలీవుడ్ హీరోయిన్ హన్సిక తన భర్త సోహైల్‌తో డివోర్స్ తీసుకున్నారు. గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉండగా విడాకుల రూమర్స్ హల్చల్ చేశాయి. దీనిపై ఇరువురూ బహిరంగంగా స్పందించలేదు. తాజాగా వీరి నాలుగేళ్ల వివాహ బంధానికి తెరపడింది. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు ఈ దంపతులకు విడాకులు మంజూరు చేసినట్లు సమాచారం. ఇరువురూ పరస్పర అంగీకారంతోనే విడిపోయినట్లు తెలుస్తోంది. హన్సిక తన భర్త నుంచి ఎలాంటి భరణం కోరలేదని తెలుస్తోంది. ఇరువురి మధ్య మనస్పర్థల కారణంగా విడిపోయినట్లు సమాచారం. ఫ్యామిలీ మెంబర్స్ దంపతుల మధ్య సయోధ్య కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గత కొద్ది రోజులుగా హన్సిక, సోహైల్ ఇద్దరూ విడివిడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. పెళ్లి ఫోటోలు సైతం హీరోయిన్ డిలీట్ చేయడంతో డివోర్స్ రూమర్లకు మరింత బలం చేకూరింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత వీరి వివాహ బంధం ముగిసింది.
అసలేం జరిగిందంటే?
హీరోయిన్ హన్సిక తన ప్రియుడు, ప్రముఖ బిజినెస్ మ్యాన్ సోహైల్ కతూరియాను డిసెంబర్ 4, 2022న వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొన్నాళ్ళు బాగానే ఉన్నా ఆ తర్వాత ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో డివోర్స్ రూమర్స్ వచ్చాయి. దీనిపై ఇద్దరూ బహిరంగంగా ఎప్పుడూ స్పందించలేదు. హన్సిక తన తల్లితో కలిసి ఉండగా సోహైల్ సైతం విడిగా ఉన్నారు. తాజాగా ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసినట్లు సమాచారం.
సోహైల్‌కు ఇది రెండో పెళ్లి
తన చిన్న నాటి స్నేహితురాలు రింకీ బజాజ్‌ను సోహైల్ మొదట వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి హన్సిక కూడా హాజరయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే రింకీ నుంచి సోహైల్ విడిపోయారు. ఆ తర్వాత హన్సికను రెండో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఆమెతో కూడా డివోర్స్ అయ్యింది. ఈ విషయం తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు.








