Mahaa Daily Exclusive

  నో టీ, కాఫీ బ్రేక్‌ఫాస్ట్‌లో కొన్నింటికి కోత …..హాస్టళ్లలో ఉండేవారికి వంట గ్యాస్ తిప్పలు….

Share

హైదరాబాద్, మహా : తెలంగాణలోని హాస్టళ్లలో వంట గ్యాస్ కష్టాలు మెుదలయ్యాయి. మెుత్తం ఫీజు కడుతున్నా హాస్టళ్లలో ఉండేవారికి మీద ప్రభావం పడుతుంది. వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాలో కొరత కారణంగా హాస్టళ్లకు తాత్కాలికంగా టీ, కాఫీ అందించరాదని హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ హాస్టళ్ల సంఘం ప్రకటించింది. టిఫిన్లు, ఇతర సమయం తీసుకునే లేదా అధిక నూనె వినియోగించే అల్పాహార వస్తువులను మెనూలో నుంచి తీసేయాలని తెలిపింది.

అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ యుద్ధం కొనసాగుతున్నందున అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. చపాతీ, దోసె, పూరీ, ఇతర సమయం తీసుకునే లేదా అధిక నూనెకు కారణం అయ్యే అల్పాహారం వస్తువులను మినహాయించాలని అసోసియేషన్ పేర్కొంది. తాత్కాలికంగా టీ, కాఫీని అందించరాదని అసోసియేషన్ హాస్టళ్లకు పంపిన సందేశంలో స్పష్టం చేసింది. పరిస్థితి, కొరతను బట్టి కొన్ని కూరలు, అదనపు ఆహార పదార్థాలను తాత్కాలికంగా నిలిపివేయవచ్చని తెలిపింది. గ్యాస్ కొరత పరిస్థితి మెరుగుపడే వరకు బియ్యం, ఇతర ప్రాథమిక భోజనం వంటి ఆహార పదార్థాలు మాత్రమే అందిస్తారు. స్వయంగా వంట చేసుకునే సౌకర్యాలు తాత్కాలికంగా నిలిపివేశారు. ‘అన్ని హాస్టల్ యజమానులు ప్రత్యామ్నాయ వంట పద్ధతులను అమలు చేయాలి. దయచేసి పరిస్థితి గురించి గెస్ట్‌లకు తెలియజేయాలని మేం అభ్యర్థిస్తున్నాం.’ అని అసోసియేషన్ తెలిపింది.

గ్యాస్ సిలిండర్ కొరతను ఎదుర్కొంటున్నామని ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ వెల్లడించింది. గ్యాస్ వినియోగాన్ని తగ్గించడానికి, పరిస్థితిని నిర్వహించడానికి, పరిస్థితి మెరుగుపడే వరకు అన్ని హాస్టల్ యజమానులు మార్గదర్శకాలను పాటించాలని అభ్యర్థించింది. మరోవైపు ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా అందుబాటులోకి రాకపోతే ఒకటి లేదా రెండు రోజుల్లో 60 శాతానికి పైగా హోటళ్లు మూసివేయాల్సి వస్తుందని తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. తగినంత స్టాక్‌లు ఉన్న పెద్ద హోటళ్లు ఒక వారానికి సరిపడా నిర్వహించగలవు. కానీ చిన్నవి రెండు రోజుల్లోనే మూసివేయవలసి రావచ్చని తెలిపింది.

రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల నుంచి 50 వేల వరకు రెస్టారెంట్లు ఉన్నాయని, వాటిలో హైదరాబాద్‌లో 20 వేల హోటళ్లు ఉన్నాయని హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. హోటళ్లు క్లోజ్ అయితే.. కేవలం టూరిస్టులు, ట్రావెలర్స్ మీద మాత్రమే కాకుండా వర్కర్స్, ఉద్యోగులు, విద్యార్థుల మీద కూడా ప్రభావం పడుతుందన్నారు. కమర్షియల్ ఎల్పీజీతో తెలంగాణలోని హోటళ్ల యజమానులు తమ కార్యకలాపాలకు అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.