Mahaa Daily Exclusive

  వైద్య సేవలు ప్రజలకు సులభంగా అందేలా చూడాలి : చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య

Share

రంగారెడ్డి జిల్లా (చేవెళ్ల) మహా:

 

షాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో “99 రోజుల ప్రగతి పాలన” కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మెడికల్ క్యాంపును చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. వైద్య సేవలు ప్రజలకు సులభంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రజలు ఈ మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైద్యులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.