Mahaa Daily Exclusive

  ఇబ్రహీంపట్నం ప్రజానేత కొండిగారి రాములు కన్నుమూత: నియోజకవర్గంలో విషాదఛాయలు

Share

“మహా నేతకు వీడ్కోలు”

మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు మృతి
ప్రజాసేవనే తన జీవన మార్గంగా
ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజా నాయకుడు
ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇబ్రహీంపట్నం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజా నాయకుడు కొండిగారి రాములు… రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు మృతి నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు. “ప్రజాసేవను తన జీవన మార్గంగా తీసుకున్న ఆయన సేవలు, ఆయన చూపిన మార్గం ఎప్పటికీ ప్రజలకు, యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయి”

అలుపెరుగని పోరాటం చేసిన మహా నేత….
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు పర్యాయాలు ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన మహానేత, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, మంచాల మండలాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించి, అధికారులను ప్రతిపక్షాలను సమన్వయం చేసుకుంటూ ప్రజాసేవకే అంకితమై నీతి నియమాలతో అలుపెరుగన సేవ చేసిన గొప్ప నాయకుడు మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు.

ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూ తెలిపిన ఎమ్మెల్యే….
మహానేత మాజీ ఎమ్మెల్యే మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే ఆయన పార్థివదేహాన్ని సందర్శించిన, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, సబిత ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, సిపిఎం నాయకులు ఏచూరి సీతారాం, పగడాల యాదయ్య పూలమాలవేసి నివాళులర్పించారు.

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలి….
ఇబ్రహీంపట్నం నియోజకవర్గస్థాయి నాయకులు కొండ్రు రఘుపతి, మాజీ ఏఎంసీ చైర్మన్ చంద్రయ్య, మాజీ ఎంపీపీ కృపేష్ తదితరులు, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు సేవలందించిన మహానేత, ఆయన నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలిచారని, ఆయన అంతక్రియలు అధికార లాంఛనాలతో చేయాలని మహానేతకు అధికార లాంచనాలతో ఆయన అంతక్రియలు చేయాలని సంఘీభావం వ్యక్తం చేశారు.