Mahaa Daily Exclusive

  మంత్రి శ్రీధర్‌బాబును కలిసిన విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతి..

Share

హైదరాబాద్‌లో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, పరిశ్రమలు మరియు శాసన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారిని విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కోకాపేటలోని విశాఖ శ్రీ శారదా పీఠంలో జరగబోయే ఉగాది ఆస్థానం కార్యక్రమానికి అలాగే శ్రీరామనవమి ఉత్సవాలకు విచ్చేయాల్సిందిగా స్వామివారు మంత్రి శ్రీధర్ బాబును ఆహ్వానించారు.

ఈ సందర్భంగా శారదా పీఠానికి సంబంధించిన ఒక సమస్యను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కారం కల్పించినందుకు స్వామివారు ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. ఆ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు చొరవ చూపిన మంత్రి శ్రీధర్ బాబు గారికి కూడా స్వామివారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం ఉత్తర పీఠాధిపతులు, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదిస్తూ, మంత్రికి ప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు కూడా పాల్గొన్నారు