Mahaa Daily Exclusive

  మూసీపై ఇప్పటివరకు డీపీఆర్‌ విడుదల చేయకపోవడం వెనుక మోసం :జాగృతి అధ్యక్షురాలు కవిత

Share

 

హైదరాబాద్, మహా : మూసీపై ఇప్పటివరకు ప్రభుత్వం డీపీఆర్‌ను ఎందుకు విడుదల చేయలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. పూర్తి డీపీఆర్‌ విడుదల చేయకపోవడం వెనుక మోసం ఉందని, మూసీ భూములను ప్రపంచ బ్యాంక్‌కు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి.. చిన్న మోదీలా వ్యవహరిస్తున్నారని, హైడ్రాను పెట్టి అరాచకం చేస్తున్నారని మండిపడ్డారు.