Mahaa Daily Exclusive

  ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌పై సీఎం చంద్రబాబు ఆగ్రహం: వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశం

Share

  • ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌పై
  • .వెంటనే నివేదిక ఇవ్వండి
  • ఎవరినీ ఉపేక్షించేది లేదు
  • టీడీపీ స్టేట్ చీఫ్ పల్లాను ఆదేశించిన చంద్రబాబు

విజయవాడ, మహా

మొయినాబాద్ డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్‌పై ఆరోపణలను చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎంపీ మహేష్‌ను పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. ఆరోపణలకు సంబంధించి వివరణ కోరుతూ పుట్టా మహేశ్‌కు నోటీసులు ఇవ్వాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను చంద్రబాబు ఆదేశించారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌ డ్రగ్స్ కేసులో పట్టుబడిన అంశంపై నివేదిక ఇవ్వాలని పల్లా శ్రీనివాస్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వ్యక్తులు, నేతలు చేసే తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వనని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు.