Mahaa Daily Exclusive

  హైవే ప్రయాణికులకు ఝలక్…. ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ధర పెంపు….

Share

 

హైదరాబాద్, మహా : జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి ఎన్‌హెచ్ఏఐ ఝలక్ ఇచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. హైవేలపై తరచూ ప్రయాణించే వారి ఖర్చును తగ్గించేందుకు, ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు గత ఏడాది ఆగస్టు 15న ఈ వార్షిక పాస్ విధానాన్ని ఎన్‌హెచ్ఏఐ తీసుకొచ్చింది. ఈ పాస్ ఒక ఏడాది పాటు లేదా ఏవైనా నేషనల్ హైవే టోల్ ప్లాజాల వద్ద గరిష్టంగా 200 సార్లు ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది. టోల్ చార్జీ ఎంత ఉన్నప్పటికీ ఈ పాస్ ఉన్నవారికి అదనపు భారం పడదు. నాన్-కమర్షియల్ వాహనాల (సొంత కార్లు, జీపులు, వ్యాన్లు) వార్షిక పాస్ ధరపై 2.5 శాతం పెరుగుదల నమోదైంది. గతంలో ఈ పాస్ ధర రూ. 3,000 ఉండగా, ఇప్పుడు అది రూ. 3,075కి చేరింది. లాంచ్​ అయ్యి ఏడాది కాకుండానే ఫాస్టాగ్​ వార్షిక పాస్​ ఫీజు పెంచడం గమనార్హం.