6వ వార్డులో ఇఫ్తార్ విందు
* పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతా సాయినాథ్
మహా :సంగారెడ్డి ప్రతినిధి :
సదాశివపేట పట్టణంలోని 6వ వార్డు కృష్ణానగర్ కాలనీలో బుధవారం వార్డు కౌన్సిలర్ నాగుల మానెమ్మ బీఆర్ఎస్ నాయకులు నాగుల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు సోదరీమణులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇఫ్తార్ -ఈ- దావత్ లో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింత సాయినాథ్ పాల్గొని ఉపవాస దీక్షలు ఆచరిస్తున్న ముస్లిం సోదరులకు పండ్లు- పానీయాలు అందించారు. ప్రజలంతా కులమతాలకతీతంగా పండుగ వాతావరణం లో గడపడం రంజాన్ మాసంతోనే సాధ్యమవుతుందన్నారు. పెద్దల పట్ల గౌరవం, తల్లిదండ్రులు, గురువుల పట్ల భక్తి, సమాజం పై శ్రద్ధ అల్లాహ్ చూపిన మార్గాలని చింత సాయినాథ్ పేర్కొన్నారు. అరవ వార్డ్ కౌన్సిలర్ నాగుల మణెమ్మ, బీఆర్ఎస్ నాయకులు నాగుల విజయకుమార్ అనునిత్యం ప్రజల్లో ఉంటూ వారి బాగోగులను చూస్తూ వార్డు అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని చింత సాయినాథ్ తెలిపారు. కార్యక్రమంలో…








