Mahaa Daily Exclusive

  పసిడి ప్రియులకు పండగే పండుగ..! అమాంతం నేలచూపులు చూసిన బంగారం, వెండి ధరలు..!

Share

  • పసిడి ప్రియులకు పండగే పండుగ..
  •  అమాంతం నేలచూపులు చూసిన బంగారం, వెండి ధరలు!
  •  ఒక్కరోజులోనే వేలల్లో కరిగిపోయిన పసిడి ధర!

 

హైదరాబాద్, మహా.

 

దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతూ కొనుగోలుదారులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఉదయం ఉన్న ధరలు సాయంత్రానికి ఊహించని విధంగా మారిపోవడం మార్కెట్లో సంచలనంగా మారింది. తాజాగా గురువారం ఉదయం గణనీయంగా తగ్గిన పసిడి ధరలు, సాయంత్రం నాటికి మరింత భారీగా పతనం కావడం పసిడి ప్రియుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ ఊహించని పరిణామంతో బంగారం కొనేవారికి అక్షరాలా నక్కతోక తొక్కినంత అదృష్టం వరించిందనే చెప్పాలి. సాయంత్రం సమయానికి ధరలు అమాంతం దిగిరావడంతో కస్టమర్లకు భారీ ఊరట లభించింది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నంతో సహా పలు ప్రాంతాల్లో ధరలు దారుణంగా పడిపోయాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం గురువారం ఉదయం ఏకంగా రూ.2550 తగ్గి రూ.1,42,750కి చేరుకోగా, సాయంత్రం నాటికి ఆ పతనం మరింత తీవ్రమైంది. సాయంత్రానికి ఏకంగా ఏకంగా మొత్తంగా రూ.7140 మేర క్షీణించి ఏకంగా రూ.1,37,750 వద్దకు దిగివచ్చింది. అదే తరహాలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి బంగారం 10 గ్రాముల ధర కూడా నేలచూపులు చూసింది. ఉదయం రూ.2780 తగ్గి రూ.1,54,640గా నమోదైన ఈ ధర, సాయంత్రం గడిచేసరికి మళ్లీ రూ.6550 మేర కరిగిపోయి ఏకంగా రూ.1,50,280కి పడిపోవడం విశేషం.

పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. సిల్వర్ మార్కెట్‌లో కిలో వెండి ధర భారీగా పతనం కావడంతో సామాన్యులకు మరింత ఊరట లభించింది. హైదరాబాద్ మార్కెట్‌లో ఏకంగా భారీ క్షీణతను నమోదు చేసుకుని కిలో వెండి ధర రూ.2,65,000 వద్దకు దిగివచ్చింది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ స్థాయిలో పసిడి, వెండి ధరలు క్షీణించడం మార్కెట్లో సంచలనంగా మారింది. వివాహాలు, శుభకార్యాల సీజన్ నేపథ్యంలో ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగా అతిపెద్ద శుభవార్త అని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Latest