Mahaa Daily Exclusive

  డాడీ, మోడీ, చిన్న మోడీపైనే నా పోరాటం’..! కొత్త పార్టీపై కవిత కీలక వ్యాఖ్యలు

Share

డాడీ, మోడీ, చిన్న మోడీపైనే నా పోరాటం’

.. కొత్త పార్టీపై కవిత కీలక వ్యాఖ్యలు

 

హైదరాబాద్, మహా

పార్టీ స్థాపించినపుడే తమ అజెండా, లక్ష్యాలను ప్రకటిస్తానని కవిత తేల్చి చెప్పారు. డాడీ, మోడీ, చిన్న మోడీలపైనే తన, తన పార్టీ పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణే తమ ధ్యేయమని.. సర్వోదయ తెలంగాణ దిశగా తమ పార్టీ ముందుకు వెళ్తుందని వెల్లడించారు. జాతిపిత మహాత్మా గాంధీ సర్వోదయ సిద్ధాంతాన్ని తాము లోతుగా అధ్యయనం చేస్తున్నామని కల్వకుంట్ల కవిత వివరించారు. ఒక సరైన ముహూర్తం వేళ పార్టీకి సంబంధించిన కీలక వివరాలను అధికారికంగా విడుదల చేయనున్నట్లు కవిత వెల్లడించారు. పార్టీ ఆఫీస్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే దానిపై స్థలాన్ని కూడా వెతుకుతున్నట్లు తెలిపారు. తాము ఎవరితో రాజీ పడేది లేదని.. తాను పెట్టబోయే కొత్త పార్టీ కచ్చితంగా విజయవంతం అవుతుందని కవిత ధీమా వ్యక్తం చేశారు.

Latest