Mahaa Daily Exclusive

  ఎఫ్ఎస్ఎల్ నియామక ఫలితాలు విడుదల : టిఎస్ఎల్ పిఆర్ బి చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు

Share

 

హైదరాబాద్, మహా : తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ లో ఖాళీగా ఉన్న వివిధ విభాగాల పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025 నవంబర్ 14న జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 60 పోస్టులకు గాను 59 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. ఈ ఎంపికలో భాగంగా సైంటిఫిక్ ఆఫీసర్ (ఫిజికల్/జనరల్) విభాగంలో 2 ఖాళీలకు ఇద్దరు పురుషులు, సైంటిఫిక్ ఆఫీసర్ (కెమికల్)లో 3 ఖాళీలకు ఇద్దరు పురుషులు, ఒక మహిళా అభ్యర్థి ఎంపికయ్యారని వివరించారు. అలాగే సైంటిఫిక్ ఆఫీసర్ బయాలజీ/సెరోలజీలో 3 ఖాళీలకు ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు, కంప్యూటర్స్ విభాగంలో 2 ఖాళీలకు ఒక్కొక్కరు చొప్పున పురుష, మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారు. సైంటిఫిక్ అసిస్టెంట్ విభాగాల్లో ఫిజికల్/జనరల్ లో 5 ఖాళీలకు నలుగురు పురుషులు, ఒక మహిళా అభ్యర్థి, కెమికల్ లో 10 ఖాళీలకు 8 మంది పురుషులు, ఒక మహిళా అభ్యర్థి (మొత్తం 9) ఎంపికయ్యారు. బయాలజీ/సెరోలజీలో 10 ఖాళీలకు నలుగురు పురుషులు, ఆరుగురు మహిళలు, కంప్యూటర్స్ లో 7 ఖాళీలకు ఆరుగురు పురుషులు, ఒక మహిళా అభ్యర్థిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ల్యాబొరేటరీ టెక్నీషియన్ విభాగంలో ఫిజికల్/జనరల్ లో 2 ఖాళీలకు ఇద్దరు పురుషులు, కెమికల్ లో 6 ఖాళీలకు నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు, బయాలజీ/సెరోలజీలో 4 ఖాళీలకు ఒక పురుషుడు, ముగ్గురు మహిళలు, కంప్యూటర్స్ లో 5 ఖాళీలకు ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఎంపిక కాగా, ల్యాబొరేటరీ అటెండెంట్ లో ఉన్న ఒక్క ఖాళీకి ఒక పురుష అభ్యర్థి ఎంపికయ్యారని చైర్మన్ వివరించారు. అభ్యర్థుల అకడమిక్ మార్కులు, పని అనుభవం మరియు రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఈ ఎంపికలు జరిగాయని, ఎంపికైన వారు ఈ నెల 23 నుండి 25వ తేదీ వరకు వెబ్‌సైట్‌లో అటెస్టేషన్ ఫారాలను పూర్తి చేసి, మార్చి 30న హైదరాబాద్‌లోని పెట్లబుర్జ్ సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ కార్యాలయంలో సమర్పించాలని ఆయన సూచించారు.

Latest