Mahaa Daily Exclusive

  ఐక్యతే శక్తి – స్నేహమే బలం

Share

 

  • సామాజిక ఐక్యతకు ప్రతీకగా రంజాన్ నిలుస్తుంది
  • ప్రజల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలకు తావులేదు
  • అభివృద్ధి ఐక్యతే లక్ష్యంగా ముందుకు సాగాలి
  • కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని దర్గాల వద్ద ముస్లిం సోదరులను కలిసిన, కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ యువ నాయకుడు మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి, వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాయి బలాయి తీసుకున్నారు..
ఈ సందర్భంగా అభిషేక రెడ్డి మాట్లాడుతూ… రంజాన్ పండుగ సౌహార్ద్రం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అన్ని మతాల ప్రజలను సమానంగా గౌరవించడం, వారి పండుగల్లో భాగస్వామ్యం కావడం తన కుటుంబం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న సంప్రదాయమని అభిషేక్ రెడ్డి తెలిపారు.
ప్రజల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలకు తావు లేకుండా, అభివృద్ధి మరియు ఐక్యతే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన స్పష్టం చేశారు. ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా, సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, ముస్లిం సోదరులు, యువ నాయకుడి చర్యను అభినందిస్తూ, ఆయన నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నీల భాను గౌడ్, రాందాస్ నాయక్, మాజీ జెడ్పిటిసి భూపతి గల్లా మహిపాల్, కొత్తకుర్మ శివకుమార్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ఫిరోజ్, సొప్పరి టోనీ, ముత్యాల సంతోష్, మొహమ్మద్ అజాం, భరత్ రెడ్డి, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Latest