Mahaa Daily Exclusive

  ఆదిలాబాద్ ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస రెడ్డి

Share

  • ముస్లీంల‌కు కంది శ్రీ‌నివాస రెడ్డి శుభాకాంక్ష‌లు
  • ఈద్గా వ‌ద్ద క‌లిసిన కంది శ్రీ‌నివాస రెడ్డి
  • ఆలింగ‌నం చేసుకుని ఈద్ ముబార‌క్ తెలిపిన అసెంబ్లీ ఇంచార్జి

ఆదిలాబాద్ మ‌హా: ఆదిలాబాద్ ప్ర‌జ‌ల సంస్కృతి భిన్న‌త్వంలో ఏక‌త్వంలా, గంగా జ‌మునా స‌ర‌స్వ‌తీ న‌దుల సంగ‌మం లాగా అన్ని పండ‌గ‌లు క‌లిసి మెలిసి జ‌రుపుకుంటామ‌ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి అన్నారు. రంజాన్ సంద‌ర్భంగా శ‌నివారం ఆయ‌న పార్టీ శ్రేణుల‌తో క‌ల‌సి ప‌ట్ట‌ణంలోని ఈద్గా మైదానం వ‌ద్ద ప్రార్ధ‌న‌ల అనంత‌రం ముస్లీం సోద‌రుల‌ను క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు.ముస్లీం సోద‌రుల‌ను ఆత్మీయంగా ఆలింగ‌నం చేసుకుని చేతిలో చేయి క‌లుపుతూ ఈద్ ముబార‌క్ తెలిపారు. ఎన్నోఏళ్లుగా ఇక్క‌డి అన్ని మ‌తాల ప్ర‌జ‌లు అన్న‌ద‌మ్ముల్లా క‌లిసి మెల‌సి ఉంటున్నార‌న్నారు. మ‌త‌సామ‌ర్యాన్ని పాటిస్తూ అన్ని పండ‌గ‌ల‌ను క‌లిసి మెలిసి జ‌రుపుకుంటున్నార‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని ముస్లీం సోద‌రుల‌కు సోద‌రీ మ‌ణుల‌కు ఆయ‌న రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. అంద‌రూ ఆయురారోగ్యాల‌తో సిరిసంప‌ద‌ల‌తో ఆనంద‌మ‌యంగా జీవించాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో డీసీసీ అధ్య‌క్షులు నరేష్ జాదవ్, ఆత్మ చైర్మ‌న్ సంతోష్ రావు,కౌన్సిల‌ర్లు సంజ‌య్, అన్నపూర్ణ, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి, లోక ప్రవీణ్ రెడ్డి,బండారి సతీష్, సుధాకర్ గౌడ్, ఎల్టీ భోజారెడ్డి,బూర్ల శంకరయ్య,దాసరి ఆశన్న,తమ్మల చందు, మైనారిటీ నాయ‌కులు ప‌త్తిముజ్జు,ఎంఏ ష‌కీల్,ఖ‌య్యూం త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Latest