- ముస్లీంల నివాసాలను సందర్శించిన కంది శ్రీనివాస రెడ్డి
- శాలువాలతో సత్కరించి రంజాన్ శుభాకాంక్షలు
ఆదిలాబాద్ మహా: నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం ముస్లీంలు ఆనందోత్సహాల మధ్య జరుపుకునే రంజాన్ పండగ సందర్భంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి పలువురు ముస్లీం సోదరుల నివాసాలను సందర్శించారు.వారిని శాలువాలతో సత్కరించి కుటుంబ సభ్యులందరికి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్, ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు, కౌన్సిలర్ ఇజ్జగిరి సంజయ్,నాయకులు కొండా గంగాధర్, లోక ప్రవీణ్ రెడ్డి, బూర్ల శంకరయ్య, తమ్మల చందు, ఖయ్యుమ్, అరవింద్, శంకర్, దాసరి ఆశన్న తదితరులు పాల్గొన్నారు.
Post Views: 57








