Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మంచాల పోతన్న మృతి: పాడె మోసి నివాళులర్పించిన కంది శ్రీనివాస రెడ్డి

Share

  • సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు మంచాల పోత‌న్న‌ మృతి
  • పాడె మోసి అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్న కంది శ్రీ‌నివాస రెడ్డి
  • కుటుంబ స‌భ్యుల‌కు ప‌రామ‌ర్శ‌

ఆదిలాబాద్ మ‌హా: ఆదిలాబాద్ రూర‌ల్ మండ‌లం అనుకుంట గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంచాల పోత‌న్న శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. విష‌యం తెలుసుకున్నఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆయన నివాసాన్ని సందర్శించి భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించారు.. అనంతరం పాడె మోసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కుటుంబ‌ సభ్యులను పరామర్శించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు, కౌన్సిల‌ర్ ఇజ్జగిరి సంజయ్,నాయ‌కులు కొండా గంగాధర్, లోక ప్రవీణ్ రెడ్డి, బండారి సతీష్, బూర్ల శంకరయ్య, తమ్మల చందు, ఖ‌య్యుమ్, అరవింద్, శంకర్, దాసరి ఆశన్న త‌దిత‌రులు పాల్గొన్నారు.

Latest