Mahaa Daily Exclusive

  విప్‌ వేములకు విద్యుత్ బిసి ఉద్యోగ సంఘం సన్మానం

Share

 

నకిరేకల్, మహా : ప్రభుత్వ విప్‌గా నియమితులైన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను నల్లగొండ విద్యుత్ బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, ప్రభుత్వ విప్ గా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ​ఈ సందర్భంగా ఉద్యోగ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రభుత్వ విప్ పదవి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సేవలో ఆయన మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.​ఈ కార్యక్రమంలో నల్లగొండ డివిజన్ ప్రధాన కార్యదర్శి దామనూరు ఈశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ బాసాని సైదులు, సబ్ డివిజన్ లీడర్ బుచ్చిరాములు, సమ్మటి సైదులు, సమ్మటి వెంకన్న, గంగాధరి శ్రీను, కోడిదల శ్రీను, లక్ష్మినారాయణ, శివ, అశోక్, కృష్ణ, సాయి, నరేందర్ తదితర విద్యుత్ శాఖ సిబ్బంది మరియు సంఘం బాధ్యులు పాల్గొన్నారు.

Latest