మహా :సదాశివపేట :
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ, మండలంలో ముస్లిం సోదరులు శనివారం రంజాన్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు.భక్తి,శ్రద్ధలతో ఈద్గా ల వద్ద ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేశారు.ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఆప్యాయంగా రంజాన్ పండుగ (ఈద్ ముబారక్ ) తెలుపుకున్నారు.సమాజంలోశాంతి,సౌభ్రాతృత్వం,ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు.
ఈద్ ఉల్ ఫితర్ పండుగను భక్తి శ్రద్ధలతో సోదర భావంతో ఘనంగా జరుపుకున్నారు.రంజాన్ నెల ముగిసిన తర్వాత జరుపుకునే ఈ పండుగ ముస్లిం లకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.ఒక నెల పాటు రంజాన్ ఉపవాసం చేసిన ఆనంతరం,నెలవంక దర్శనంతో షావ్వల్ మాసం ప్రారంభం అవుతుంది.
ఆ నెల మొదటి రోజున ఈద్ పండుగను జరుపుకుంటారు.ఈ రోజు అల్లాకు కృతజ్ఞతలు తెలిపే రోజుగా కూడా భావిస్తారు. సదాశివపేట ఈద్గా వద్ద జరిగిన కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యే తనయుడు చింత సాయినాథ్, టిఆర్ఎస్ నాయకులు నాగుల విజయకుమార్ ,దిడిగి నాగేష్, తదితర బీఆర్ఎస్ నాయకులు హాజరై ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.








