- గవర్నర్‌ను కలిసిన మంత్రి కొండా సురేఖ
- భద్రాచలం సీతారామ కల్యాణానికి హాజరు కావాలని విజ్ఞప్తి
- ఆహ్వాన పత్రిక అందజేత
హైదరాబాద్, మహా: రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సోమవారం లోక్ భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శూక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో మార్చి 27న నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖాధికారులతో కలిసి అందజేశారు. భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణం యొక్క విశిష్టత గురించి కొండా సురేఖ గవర్నర్ కు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరిగే పవిత్ర వేడుకని, ఈ మహోత్సవానికి దేశం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు, అర్చకులు పాల్గొన్నారు..







