*వరంగల్ ఫ్లాష్.. ఫ్లాష్ న్యూస్*
*మిల్స్ కాలనీ ఎస్సై ఎం సురేష్ పై సస్పెన్షన్ వేటు*
*మొదట విఆర్ కు అంతలోనే సస్పెన్షన్ వేటు*
*మహిళ పట్ల అనుచిత వ్యవహారమే కారణం*
*డిపార్ట్మెంట్ విచారణతో సస్పెన్షన్ కు ఆదేశాలు జారీచేసిన సీపీ*
మహా వరంగల్ బ్యూరో;
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారుల తీరు పై ఇటీవల తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది అధికారులు పోలీస్ శాఖ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారని గత కొంతకాలంగా ఆ శాఖలోని పోలీస్ సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. ఇది గమనిస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆ పోలీస్ అధికారుల పై క్రమశిక్షణ చర్యలు చేపడుతున్నారు. కాగా మంత్రి కొండా సురేఖ ఇలాఖలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎం సురేష్ పై అవినీతి ఆరోపణలతో పాటు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం పై వరంగల్ ఏఎస్పీ శుభం ప్రకాష్ దృష్టికి రాగానే మొదట సదరు ఎస్సై ని రెగ్యులర్ గా నియమించే వీధుల నుంచి తప్పించి నేర విభాగం విధులు అప్పగించారు. గతంలోనే ఐపీఎస్ ఆఫీసరైన వరంగల్ ఎస్పీ శుభం పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశం పై పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఇటీవల విచారణలో ఆరోపణలు నిజమని నిర్ధారించిన్నట్లుగా తెలుస్తోంది. మొదట మంగళవారం విఆర్ కు అటాచ్ చేసిన ఎస్ఐ ని సదరు ఏఎస్పి సిఫార్సు మేరకు బుధవారం రాత్రి పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సస్పెన్షన్ వేటు వేసిన్నట్లుగా తెలుస్తోంది. ఎస్సై మంత్రికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తితో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. సదరు నేత అండదండతో ఆ ఎస్సై దురుసుగానే కాక ఎవ్వరిని లెక్క చేయకుండా వ్యవహరించారనే ఆరోపణలు చాలానే ఉన్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఎస్సై పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి రాజకీయ ఒత్తిళ్ల కారణంగా దాదాపు ఆరు నెలలకు పైగానే పట్టింది. ఈ వేటుతో మరికొందరు పోలీస్ అధికారుల పై పోలీస్ కమీషనర్ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది.







