Mahaa Daily Exclusive

  వైన్స్ షాపులకు దేవుని పేర్లు తీసేయాలి..! అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా డిమాండ్‌..

Share

మహా

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలకు దేవుని పేర్లు తీసేయాలని బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. ఇకపైన మద్యం దుకాణాలకు దేవుడి పేర్లు పెట్టకుండా చట్టాలు తీసుకురావాలని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు. దేవుళ్ళ పేర్లు పెట్టి హిందూ మతాన్ని అవమానిస్తున్నారని, దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ఇకపైన లైసెన్సులు ఇచ్చేటప్పుడే దేవుని పేర్లు మద్యం దుకాణాలకు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు.

 

వందల దుకాణాలకు దేవుడి పేర్లు

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది సంఖ్యలో మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ మద్యం దుకాణాలకు ఎక్కువమంది దేవుడి పేర్లు పెడుతున్నారు. రేణుక ఎల్లమ్మ, మైసమ్మ తల్లి, వెంకటేశ్వర వైన్స్, అంటూ రకరకాల హిందూ దేవతల పేర్లు పెట్టుకుని మద్యం దుకాణాలు నడిపిస్తున్నారు. హిందూ దేవుళ్ళ పేర్లు పెట్టుకుని మద్యం దుకాణాలను నడిపిస్తే మంచి గిరాకీ వస్తుందని జనాల నమ్మకం. అందుకే ఇలా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇకపైన‌ మద్యం దుకాణాలకు దేవుడి పేర్లు పెట్టకూడదని బీజేపీ కొత్త డిమాండ్ తెరపైకి తీసుకువచ్చింది.

Latest