రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న కందిమల్ల సాయి అనే విద్యార్థి, గురునానక్ లోని హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నల్లగొండ జిల్లాలోని నందిగూడెం మండలం శ్రీరంగాపురానికి చెందిన సాయి(20) గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, పరిసర ప్రాంతాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించినందుకు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సిఐ మహేందర్ రెడ్డి వెల్లడించారు.
గతంలోనూ విద్యార్థుల ఆత్మహత్యలు…
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో గతంలో కూడా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి?. యాజమాన్యం ఒత్తిడి కారణమా?, మరి ఏదైనా కారణమా? తరచూ ఇలాంటి సంఘటనలు జరగడంతో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.








