Mahaa Daily Exclusive

  పింఛన్ డబ్బుతో సీతమ్మకు నగ సమర్పించిన వృద్ధురాలు..

Share

  • ఆంధ్రా ఆధునిక శబరి గా బుచ్చమ్మకు ప్రశంసలు..

అశ్వారావుపేట, మార్చి 27, మహా : శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఓ వృద్ధురాలు చూపిన భక్తి అందరినీ కదిలించింది. ఆంధ్రాకు చెందిన బుచ్చమ్మ అనే వృద్ధురాలు తనకు వచ్చే వృద్ధాప్య పింఛన్ డబ్బులతో సీతమ్మకు నగ కొనుగోలు చేసి సమర్పించడం భక్తి భావానికి నిదర్శనంగా నిలిచింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, దేవుడిపై అపారమైన నమ్మకంతో ఆమె చేసిన ఈ సమర్పణ స్థానిక భక్తులను భావోద్వేగానికి గురి చేసింది. బుచ్చమ్మ భక్తిని చూసిన ప్రజలు ఆమెను ఆంధ్రా ఆధునిక శబరిగా అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపించారు. తాను తీసుకొచ్చిన నగను ఆలయ అధికారులకు ఎలా అందజేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిన భద్రాచలం ఉప కలెక్టర్ మృణాళ్, అశ్వారావుపేట తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ సహాయంతో ఆ నగను పురోహితులకు అందజేయాలని సూచించారు. శ్రీరామ నవమి రోజున ఈ అరుదైన ఘటన చోటుచేసుకోవడం ప్రత్యేకతను సంతరించుకుంది. భక్తి, నమ్మకం ఉంటే ఆర్థిక పరిస్థితులు అడ్డంకి కావని బుచ్చమ్మ తన చర్యతో నిరూపించిందని పలువురు అభిప్రాయపడ్డారు.

Latest