మహా
మైనింగ్ మంత్రి వివేక్‌పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సీరియస్ అయ్యారు. రాఘవ క్రషర్ మీద ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు నిలదీయడంతో.. ఆయనకు కౌంటర్ ఇవ్వడంలో మంత్రి వివేక్ ఫెయిల్ అయ్యారని అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా ఆగ్రహించారు. హరీశ్‌రావు అన్ని ఆధారాలతో సహా రాఘవ క్రషర్ వ్యాపారాన్ని వెలుగులోకి తీసుకురాగా.. మైనింగ్ మంత్రి అయిన వివేక్ మాత్రం సరైన సమాధానం ఇవ్వడంలో వెనుకబడిపోయారు. అంతేకాకుండా.. క్రషర్ సంస్థకు మైనింగ్ అధికారులు స్వయంగా నోటీసులు జారీ చేశారని హరీశ్‌రావు వెల్లడించినా.. అసలు నోటీసుల అంశం తనకు తెలియదంటూ సభ సాక్షిగా వివేక్ చెప్పడం మిగతా మంత్రుల్లో మరింత ఆగ్రహం తెప్పించింది. ఎలాంటి వివరాలు లేకుండా మాట్లాడడంపైనే శ్రీధర్ బాబు ఆయనకు క్లాస్ తీసుకున్నారు. సభ ముగిసిన తరువాత 20 నిమిషాల పాటు బీఆర్ఎస్ సభ్యులంతా ఒక దగ్గరకు చేరి చర్చించుకున్నారు. హాలులో ఉన్న అధికారులతో వివేక్ మాట్లాడుతుండగా.. ఆయనను పిలిచి మరీ సెటైర్ వేశారు. ‘వివేక్ అన్నా.. మొత్తానికి సాధించావ్’ అంటూ ఆయనపై కేటీఆర్ సెటైర్ వేశారు. మైనింగ్ అక్రమాలపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ సీఐడీ ఎంక్వయిరీకి ఆదేశించడంతో వివేక్‌పై ఈ వ్యాఖ్య చేశారని బీఆర్ఎస్ సభ్యుడు అన్నారు.







