- ఇదే దిక్కుమాలిన ప్రభుత్వం
- రేవంత్ ప్రభుత్వంపై రాజగోపాల్ రుస రుస
- నివ్వెరపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- అసెంబ్లీ వేదికగా రేవంత్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేసిన మునుగోడు ఎమ్మెల్యే
హైదరాబాద్, మహా : మంత్రి పదవి కోసం ఎన్నాళ్ళుగానో ఆసలు పెట్టుకున్న మునుగోడు ఎమ్మెల్యే తన అసంతృప్తిని అసెంబ్లీ వేదికగా మరోసిర వెళ్ళగక్కారు. రాష్ట్ర ప్ఱభుత్వంపై ఆయన విమర్శల దాడికి దిగారు. ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వని ప్రభుత్వం ఇదేం దిక్కుమాలిన ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశాలలో భాగంగా ఆదివారం అసెంబ్లీలో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సొంత ప్రభుత్వంపై తన అక్కసు వెళ్ళగక్కారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌ను అభివృద్ధి చేసుకున్నట్లు, నాకు నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఉండదా?,
భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గానికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గానికి లిఫ్ట్ లు తరలిస్తున్నారు. మేమేం పాపం చేశాం, మాకెందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. మా నియోజకవర్గాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు కనీసం బిల్లులు కూడా మంజూరు చేయడం లేదని మండిపడ్డారు.
ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి, మంత్రులు మాత్రమే కాదు, ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం అని తెలుసుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. మేం ప్రజలు ఓట్లేస్తేనే గెలిచాం, సీఎం మంత్రులు కూడా అలానే గెలిచారు. అయినప్పటికీ నిధుల కోసం రేవంత్ రెడ్డి చుట్టూ, మంత్రుల చుట్టూ తిరగాలా? అని నిలదీశారు. ప్రాంతాలు, నియోజకవర్గాలపై వివక్ష చూపొద్దంటూ అందరినీ సమానంగా చూడాలి, అన్ని ప్రాంతాలు తెలంగాణవే అని గుర్తించాలన్నారు. నిధులు ఇవ్వాల్సిందేని, లేకపోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందన్న విషయాన్ని గుర్తించుకోవాలని గర్జించారు.








