పారాక్వాట్ (గడ్డిమందు ) తయారీ మరియు అమ్మకాలపై పూర్తిస్థాయి నిషేధాన్ని విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన ప్రభుత్వానికి టీపీసీసీ డాక్టర్ సెల్ , మెడికల్ & హెల్త్ విభాగం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ రాజీవ్ కృతజ్ఞతలు.
పారాక్వాట్ (గడ్డి మందు) వంటి అత్యంత ప్రమాదకరమైన రసాయనం అనుకోకుండా లేదా ఆత్మహత్య ప్రయత్నాల్లో వినియోగించబడుతూ తీవ్రమైన విషప్రభావాలకు, ఊపిరితిత్తుల వైఫల్యానికి, అవయవ నష్టానికి, మరణాలకు దారితీస్తోంది. పారాక్వాట్ పాయిజన్ కి ఎటువంటి యాంటిడోట్ లేకపోవడం పలు మరణాలకి దారితీస్తుంది . ఇటువంటి విషపూరిత పదార్థాలపై నియంత్రణ ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకం.
ఈ నిర్ణయం వల్ల కుటుంబాలను కాపాడటం, యువతలో ఆత్మహత్యలను తగ్గించడం, గ్రామీణ ప్రాంతాల్లో జరిగే విషపూరిత ఘటనలను నియంత్రించడం వంటి అనేక సామాజిక మరియు భావోద్వేగ ప్రయోజనాలు కలుగుతాయి. ఇది *కేవలం ఆరోగ్య పరమైన నిర్ణయం మాత్రమే కాదు, ప్రజల ప్రాణాలను విలువైనవిగా భావించే మానవతా దృక్పథంతో తీసుకున్న బాధ్యతాయుతమైన ప్రభుత్వ నిర్ణయం .*
*ప్రజల భద్రతను ప్రాధాన్యతగా తీసుకుని, ముందుచూపుతో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 👏🏻👏🏻*
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనరసింహ గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు.







