Mahaa Daily Exclusive

  ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్టకు 18 కోట్లతో సుందరీకరణ పనులు – ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పరిశీలన

Share

  • చెరువు కట్ట సుందరికరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
  • 18 కోట్లతో పెద్ద చెరువు అభివృద్ధి పనులు
  • ట్యాంకు బండి తరహాలో అభివృద్ధి చేస్తాం
  • ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి

 

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:

పెద్ద చెరువు కట్ట సుందరీకరణ పనులను ఎమ్మెల్యే రంగారెడ్డి పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి తలమానికమైన పెద్ద చెరువు కట్టను అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తాం అని ఎమ్మెల్యే రంగన్న చెప్పారు. చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేస్తాము. కట్ట మైసమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేసి, భక్తులకు అన్ని సౌకర్యాలు కలిపిస్తామన్నారు. కట్ట పై ప్రమాదాలు జరగకుండ చెరువు కట్టకు ఇరు వైపులా సేఫ్టీ రైలింగ్, లైటింగ్స్ నిర్మాణం చేయడం జరిగిందని ఎమ్మెల్యే రంగారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఏఎంసీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ అధికారులు, స్థానిక కౌన్సిలర్లు, ఆరుట్ల మాజీ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యాల రాజశేఖర్ రావు, చీమల జంగయ్య, సల్మాన్ పలువురు పాల్గొన్నారు.

Latest