Mahaa Daily Exclusive

  తమిళనాడు బీజేపీ తొలి జాబితా విడుదల: మైలాపూర్ బరిలో తమిళసై, అవినాశి నుంచి ఎల్. మురుగన్!

Share

  • మైలాపూర్ బరిలో తెలంగాణ మాజీ గవర్నర్
  • అవినాశి నుంచి కేంద్ర మంత్రి ఎల్ మురుగన్
  • కోయంబత్తూర్ (నార్త్) నుంచి వానతీ శ్రీనివాసన్
  • తమిళనాడు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల

చెన్నై, మహా : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 27 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. మాజీ గవర్నర్ తమిళసై మైలాపూర్ నుండి, కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ అవినాశి నుండి పోటీ చేస్తున్నారు. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి గాను తొలి విడతలో 27 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇందులో పలువురు ప్రముఖులకు చోటు కల్పించడం విశేషం. తెలంగాణ మాజీ గవర్నర్, సీనియర్ నేత తమిళసై సౌందరరాజన్ చెన్నైలోని ప్రతిష్టాత్మకమైన మైలాపూర్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్నారు. అలాగే కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ ‘అవినాశి (ఎస్సీ)’ స్థానం నుండి పోటీ చేయనున్నారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ కోయంబత్తూర్ (నార్త్) నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

బీజేపీ అభ్యర్థుల జాబితా ఇదే

ఆవడి – ఎం. రాజసింహ మహేంద్ర (ఎం. అశ్విన్‌కుమార్)

మైలాపూర్ – తమిళసై సౌందరరాజన్

తళ్ళి – నగేష్ కుమార్

తిరువణ్ణామలై – సి. ఎలుమలై

రాసీపురం (ఎస్సీ) – ఎస్.డి ప్రేమ్‌కుమార్

మొడక్కురిచ్చి – కీర్తిక శివకుమార్

ఉదగమండలం – భోజరాజన్

అవినాశి (ఎస్సీ) – ఎల్. మురుగన్

తిరుప్పూర్ (సౌత్) – ఎస్. తంగరాజ్

కోయంబత్తూర్ (నార్త్) – వానతీ శ్రీనివాసన్

తిరువారూర్ – గోవి చందు

తంజావూర్ – మురుగానందం

గంధర్వకోట్టై (ఎస్సీ) – సి. ఉదయకుమార్

పుదుక్కోట్టై – ఎన్. రామచంద్రన్

అరంతంగి – కవితా శ్రీకాంత్

తిరుప్పత్తూర్ – కేసీ తిరుమారన్

మానామదురై (ఎస్సీ) – పొన్. వి. బాలగణపతి

మదురై సౌత్ – రామ శ్రీనివాసన్

సాత్తూర్ – నైనార్ నాగేంద్రన్

రామనాథపురం – జీబీఎస్ కే. నాగేంద్రన్

తిరుచెందూర్ – కేఆర్‌ఎం రాధాకృష్ణన్

వాసుదేవనల్లూర్ (ఎస్సీ) – అనంతన్ అయ్యసామి

రాధాపురం – ఎస్పీ బాలకృష్ణన్

నాగర్‌కోయిల్ – ఎం.ఆర్ గాంధీ

కొలచల్ – టి. శివకుమార్

పద్మనాభపురం – పి. రమేష్

విలవంకోడ్ – ఎస్. విజయధరణి

Latest