రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇబ్రహీంపట్నంలో ప్రవేట్ స్కూల్ ప్రారంభించిన ముఖ్యమంత్రి వర్యులు, ప్రభుత్వ పాఠశాలలకి ఏం మేసేజ్ ఇస్తున్నారో అర్థం కావడం లేదని బద్రీనాథ్ గుప్తా అన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అని చెబుతూ మరోపక్క స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రవేట్ స్కూళ్లను ప్రోత్సహించేలా రిబ్బన్ కటింగ్ లు చెయడం ఎంత వరకు సమంజసమని, మంచాల బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు, వనపర్తి బద్రీనాథ్ గుప్తా ఆరోపించారు. ఇప్పటికే అదిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలకు, రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచేలా ఉందని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కాళ్లు తరిచి పేద ప్రజలకు అండగా నిలిచేలా పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించేలా చూడాలని ఆయన సూచించారు.
Post Views: 7








