హైదరాబాద్, మహా : ఇంటర్ ఫలితాలపై బిగ్ అప్డేట్ వచ్చింది. ఈనెల 12వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు. ఫస్ట్ ఇయర్, సెకండియర్ తో పాటు ఒకేషనల్ కోర్సుల ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 4,89,126 మంది మొదటి సంవత్సరం, 5,07,949 మంది రెండో సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
ఫలితాలను ఇలా చెక్ చేసుకోవాలి
ఇంటర్ ఫలితాల కోసం అధికారిక వెబ్సైట్ tgbie.cgg.gov.in లోకి వెళ్లాలి. హోమ్ పేజీలోని ఇంటర్ రిజల్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి. హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి.
సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. అనంతరం ఫలితాలు మీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి.
ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్ కాపీని పొందవచ్చు.








