- తన నివాసంలో కోలాహలంగా నిర్వహించిన అభిమానులు
- ఈ వేడుకకు హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు
- ఆయనకు అభిమానులు నేతలు శుభాకాంక్షలు తెలిపారు
ఇబ్రహీంపట్నం జూలై 1 మహా:
ఏఎంసీ చైర్మన్ గురునాథ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథరెడ్డి జన్మదిన సందర్భంగా తన అభిమానులు ఆయన నివాసంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గత 40 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉంటూ, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పరితపించే నాయకుడు కంబాలపల్లి గుర్నాథ్ రెడ్డి అని పలువురు కొనియాడారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో నియోజకవర్గంలోని రైతుల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేయడం జరుగుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరుగుతుందన్నారు. రైతుల సంక్షేమం కోసం మార్కెట్ కమిటీ ద్వారా కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం ద్వారా రైతులకు కావలసిన పరికరాలను పనిముట్లను అందించడం జరిగిందని రైతులు అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా విచ్చేసి శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు ఆయన తెలిపారు..







