Mahaa Daily Exclusive

  పుష్ప 2పై షాకింగ్ ట్వీట్ పెట్టి డిలీట్ చేసిన టీడీపీ ఎంపీ…!

Share

ఏపీలో టికెట్ రేట్ ల పెంపు కోసం పుష్పా టీం మల్ల గుల్లాలు పడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ చేసిన ఒక ట్వీట్ కలకలం రేపుతోంది. అయితే ట్వీట్ చేసిన కాసేపటికే దాన్ని డిలీట్ చేశారు.

అల్లు అర్జున్ గారు నంద్యాలలో మీరు చేసిన ఎలక్షన్ క్యాంపెయిన్ మా జనాలు ఇంకా మర్చిపోలేదు. నంద్యాలలో మీరు ఎలా అయితే ప్రీ ఎలక్షన్ ఈవెంట్ నిర్వహించారో అలాగే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తారని కోరుకుంటున్నాం అని పేర్కొన్నారు. నంద్యాల వెళ్లాలనే మీ సెంటిమెంట్ మాకు బాగా వర్క్ అయింది. కాబట్టి మీ సెంటిమెంట్ ఇప్పుడు మా సెంటిమెంట్ అయింది. పుష్ప 2 సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ అవ్వాలి అంటూ ఆమె వ్యంగంగా ట్వీట్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే దాన్ని ఎడిట్ చేశారు. ఆ తర్వాత డిలీట్ కూడా చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుష్ప టికెట్ రేట్లు పెంచుతుందా లేదా అనేది హాట్ టాపిక్ అవుతోంది.

Latest