Mahaa Daily Exclusive

  శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండండి డిజిపి, సీపీలకు – సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

Share

అల్లు అర్జున్ ఇంటిపై దాడి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నానని, ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసులు ఎవరూ స్పందించవద్దని ఆదేశించారు. పరోక్షంగా ఆదివారం మీడియా సమావేశం నిర్వహించిన విష్ణుమూర్తి వ్యవహారంపై సీరియస్ అయ్యారు. ఇతర సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.