- గత రెండు సిరీస్ మ్యాచ్ లలో ఇక్కడ విజయం
- హ్యాట్రిక్ విక్టరీపై టీమిండియా గురి
- గెలిస్తే 2-1 ఆధిక్యంతో పెరగనున్న ఆత్మవిశ్వాసం
- కలవరపరుస్తున్న బ్యాటింగ్
- బౌలింగ్ లో బుమ్రా పైనే మొత్తం భారం
- బాక్సింగ్ డే టెస్ట్ లో పంచ్ పవర్ ఎవరిది..?
- మెల్ బోర్న్ లో హ్యాట్రిక్ పక్కానా..?
- కంగారూలు కంగారు పడతారా ..? పెట్టిస్తారా
- కీఫైట్
మహా స్పోర్ట్స్ డెస్క్ : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో నేడు మెల్బోర్న్ వేదికగా కీలక 4వ మ్యాచ్ బాక్సిండ్ డే టెస్ట్ జరగనుంది.ఇక్కడ జరిగిన ఓవరాల్ మ్యాచ్ లతో పోల్చకుండా చూస్తే ఇటీవలి కాలంలో ఈ మైదానంలో టీంఇండియాకు మంచి రికార్డ్ ఉంది. ఇదే బ్యానర్ పై 2018 ,2020 టెస్ట్ సిరీస్ లలో ఇక్కడ మ్యాచ్ గెలవడమే కాకుండా సిరీస్ లను సైతం గెలుచుకుంది భారత్. ఒక రకంగా చెప్పాలంటే టీఇండియాకు ఇది చాలా అచ్చొచ్చిన పిచ్ . ఇక్కడ మ్యాచ్ గెలిస్తే మెల్ బోర్న్ మ్యాచ్ హ్యాట్రికే కాదు.. ఈ సిరీస్ లో 2-1 ఆధిక్యతతో మరింత ఆత్మ విశ్వాసంతో చివరి టెస్ట్ కు సిద్ధమయ్యే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ఆస్ట్రేలియాలో ఆసీస్ పై హ్యాట్రిక్ సిరీస్ విజయానికి బాటలు వేసుకునేందుకు మార్గం సుగమమవుతంది. భారత్ లో జరిగిన 2016 ,2022 సిరీస్ లలో కూడా భారత జట్టే సిరీస్ లు గెలుచుకుంది.అంటే వరుసగా 2016 నుండి ఇప్పటివరకు ఆసీస్ పైబోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమ్ ఇండియా దే ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. ఇదే ఒరవడి కొనసాగి మెల్ బోర్న్ టెస్ట్ తో పాటు చివరి టెస్ట్ లోనూ నెగ్గి హ్యాట్రిక్ సిరీస్ విజయాలు నమోదు చేయాలని భారత్ క్రికెట్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక ఇరు జట్లను గాయాలు కలవర పెడుతున్నాయి.ప్రాక్టీస్ సెషన్ లో గాయాల బారిన పడిన రోహిత్ ,రాహుల్ లలో రోహిత్ సిద్దమవగా ఫామ్ లో ఉన్న రాహల్ మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది సందేహమే.ఇక అటు భారత్ కు తలనొప్పిగా మారిన ఆసీస్ కీలక బ్యాట్స్ మెన్ ట్రావిస్ హెడ్ కూడా గాయంతో ఇబ్బంది పడుతున్నాడు.కాని తుది జట్టులో కొచ్చేందుకు ఫిట్నెస్ నిరూపించుకున్నట్టు సమాచారం. ఇక గాయంతో పేసర్ హేజిల్ ఉడ్ దూరమవగా బోలాండ్ అతని స్థానాన్ని భర్తీ చేస్తాడు.అనుభజ్ఞుడైన హేజిల్ ఉడ్ మ్యాచ్ కు అందుబాటులో ఉండక పోవడం ఆసీస్ కు బ్యాడ్ లక్ కాగా టీమ్ ఇండియా కు కలిసి వచ్చే అంశం.బాక్సింగ్ డే టెస్ట్ లో ఆసీస్ తరపున ఓ 19 ఏళ్ళ కుర్రాడు సామ్ కాన్ స్టస్ టెస్ట్ అరంగ్రేట్రం చేయనున్నాడు. ఇక ఈ ఐదు మ్యాచ్ లసిరీస్ లో భారత్ ఆస్ట్రేలియా తలో మ్యాచ్ గెలిచి 1-1 తో సమంగా ఉండగా మూడో మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అయ్యింది.ఆధిక్యత సాధించేందుకు కీలకమైన ఎమ్సీజీ గ్రౌండ్ లో భారత్ కే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నా..ప్రత్యర్ధిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అంతగా అనుభవం లేని పింక్ బాల్ డే అండ్ నైట్ టెస్ట్ లో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. బ్యాటింగ్ భారత్ ఇంకా కుదురుకోలేదు. తొలి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ కు దూరమైన సందర్భంలో జైస్వాల్ తో కలిసి కెఎల్ రాహుల్ ఓపెనర్ గా వచ్చాడు. రెండో ఇన్నింగ్స్ లో ఈ జోడి రికార్డ్ పార్టనర్ షిప్ నమోదు చేయడంతో మిగతా రెండు టెస్టుల్లోను కెఎల్ రాహుల్ ను ఓపెనర్ గా కొనసాగించారు.కాని అంతగా వర్కవుట్ కాలేదు అంతే కాదు బ్యాటింగ్ ఆర్డర్ లో కిందకు వచ్చిన రోహిత్ కూడా అంతగా రాణించలేక పోయాడు. సో ఈ కీలక టెస్ట్ లో తిరిగి రోహిత్ శర్మ ఓపెనింగ్ కొచ్చే అవకాశముంది.ఏదేమైనా ఈ కీలక టెస్ట్ మాత్రం రసవత్తరంగా సాగే ఛాన్సుంది.
పిచ్ అండ్ వెదర్
మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ డ్రాప్ ఇన్ పిచ్ బ్యాటింగ్,బౌలింగ్ కు సమతూకంగా ఉంటుంది. తొలి సెషన్ కీలకం. కొత్త బంతితో తొలుత సీమర్లకు చక్కటి బౌన్స్ లభిస్తుంది.పాతబడినా కొద్దీ బ్యాటింగ్ కు చక్కగా అనుకూలిస్తుంది.టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ 52 శాతం విజయాలను నమోదు చేసుకుంటే ముందుగా బౌలింగ్ ఎంచుకున్న జట్టు 42 శాతం విజయాలను అందుకుంది.ఈ గ్రౌండ్ పై హయ్యస్ట్ టోటల్ 624 పరుగులు కాగా లోయస్ట్ టోటల్ 36 రన్స్ , ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజి స్కోర్ 307 కాగా సెకండ్ ఇన్నింగ్స్ యావరేజి స్కోర్ 312 రన్స్. దీన్ని బట్టి ఎమ్ సీ జీ పై బ్యాటింగ్ కూడా పెద్ద కష్టం కాక పోవచ్చని తెలుస్తోంది.ఇక వర్షంకారణంగా మూడో టెస్ట్ డ్రా గా ముగిసినా ఇక్కడ మాత్రం అలాంటి సూచన లేవీ లేవు వాతావరణం 40 డిగ్రీల ఉష్ణోగ్రత తో చాలా పొడిగా ఉండ నుంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ వైపే మొగ్గు చూపే అవకాశముంది.
ఇరు జట్ల అంచనా
టీమ్ ఇండియా : యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్ ), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా : ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మార్కస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్







