- ఆ ఆరోపణలు నిజమే
- ఛార్జిషీట్ లో పేర్కొన్న పోలీసులు
హైదరాబాద్, : జానీ మాస్టర్ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేశారు నార్సింగ్ పోలీసులు. ఈవెంట్ పేర్లతో పలు ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాటుపడినట్లు పోలీసుల నిర్ధారించారు.లేడీ కొరియోగ్రాఫర్‌పై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఈవెంట్స్ పేరుతో ఇతర ప్రాంతాలకు ఆమెను తీసుకెళ్లి, ఆమెపై లైంగిక దాడులకు పాల్పడినట్లు పోలీసులు తమ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు జానీ మాస్టర్ గత కొంతకాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ.. మహిళ అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ సెప్టెంబర్ 15వ తేదీన నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది..ఇప్పుడు ఆమె మాటలు నిజమేనని పోలీసులు తేల్చారు.
……………
Post Views: 76







