- -8 మంది మృతి
- – 18 మందికి తీవ్ర గాయాలు
పంజాబ్: పంజాబ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. బఠిండాలో శుక్రవారం ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురై కాల్వలో పడిపోయింది. జీవన్ సింగ్ వాలా గ్రామ సమీపంలో అదుపు తప్పి వంతెన రెయిలింగ్ ను ఢీకొట్టింది, అనంతరం కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది మృతిచెందారు. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే సహాయక చర్యలను చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 50 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.
Post Views: 81







