Mahaa Daily Exclusive

  మ‌చ్చ‌లేని మ‌హామ‌నిషి మ‌న్మోహ‌న్ సింగ్ ..

Share

  •  -ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి
  • – కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో ప్రజాసేవాభ‌వ‌న్ లో సంతాప స‌భ‌
  • – పెద్ద సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ శ్రేణులు

 

ఆదిలాబాద్, మ‌హా: నిజాయితీకి, నిబద్ధతకు, నిరాడంబ‌ర‌త‌కు నిలువుటద్దం ఆర్థికవేత్త‌ మాజీ ప్రధాన మంత్రి డాక్ట‌ర్ మన్మోహన్ సింగ్ అని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి అన్నారు. శుక్ర‌వారం ఆయ‌న క్యాంపు కార్యాల‌యం ప్ర‌జా సేవాభ‌వ‌న్ ఆవ‌ర‌ణ‌లో సంతాప స‌భను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున హాజ‌రైన కాంగ్రెస్ శ్రేణుల‌తో క‌ల‌సి మ‌న్మోహ‌న్ సింగ్ చిత్ర ప‌టానికి పూల‌మాల‌లు వేసి అశ్రు నివాళి అర్పించారు. ఆయ‌న మృతికి సంతాపంగా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూర్చాల‌ని భ‌గ‌వంతున్ని ప్రార్ధించారు. త‌న లాంటి ఎంతోమంది రైతు బిడ్డ‌లు వ్యాపార వేత్త‌లుగా ఎద‌గ‌డానికి కార‌ణం ఆయ‌న సంస్క‌ర‌ణ‌లే అన్నారు. దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న వేళ ఆర్థిక మంత్రిగా త‌న దైన శైలీలో ప‌లు ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు ప్ర‌వేశపెట్టి దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను తిరిగి గాడిలో పెట్టిన మేధావి అని కొనియాడారు. దేశాన్ని లైస‌న్స్ రాజ్ నుండి సంస్క‌ర‌ణ‌ల‌వైపు మ‌ళ్లించిన గొప్ప నేత అన్నారు. ఆయ‌న మ‌ర‌ణం కాంగ్రెస్ పార్టీతోపాటు దేశానికి పూడ్చ‌లేని లోట‌ని పేర్కొన్నారు. ప్రొఫెసర్ గా, ఎక‌నామిస్ట్ గా, రిజ‌ర్వ్ బ్యాంక్ గ‌వ‌ర్న‌ర్ గా, ఆర్థిక శాఖా కార్య‌ద‌ర్శిగా, ప్ర‌ణాళికా సంఘం వైస్ చైర్మ‌న్ గా, యూజీసీ చైర్మ‌న్ గా, ఆర్ధిక మంత్రిగా, దేశ ప్ర‌ధానిగా ఎన‌లేని సేవ‌లందించిన బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి మ‌న్మోహ‌న్ సింగ్ అని గుర్తుచేశారు. దేశ జీడీపీ 3శాతంగా దేశం క్లిష్ట ప‌రిస్థితిలో ఉన్న‌ప్పుడు ఆనేక ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌తో వృద్ధి రేటును ప‌రుగులు పెట్టించిన ఆర్థిక మేధావి అన్నారు. దేశంలో ఎన్నో విప్లవాత్మ‌క మార్పులకు నాంది ప‌లికిన మ‌హానుభావుడ‌న్నారు. ఆయ‌న మృతికి సంతాప‌గా ఏడు రోజులు సంతాప‌దినాలుగా పాటిద్దామ‌న్నారు. అనంత‌రం స‌భ‌లో ప‌లువురు నేత‌లు దేశానికి ఆ మ‌హ‌నీయుడు అందించిన సేవ‌ల‌ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ రావు పటేల్, స‌యీద్ ఖాన్, పట్టణ అధ్యక్షులు గుడిపల్లి నగేష్, నాయకులు గిమ్మ సంతోష్ రావు, మునిగేల నర్సింగ్, లోక ప్రవీణ్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, బండారి సతీష్, ఆవుల వెంకన్న, సంద నర్సింగ్, రామ్ కుమార్, భూమన్న, లక్ష్మణ్, షేక్ ఇమ్రాన్, జాఫర్ అహ్మద్, నాయకుడు ఎం. ఏ షకీల్, సహీద్ ఖాన్, పోరెడ్డి కిషన్, కొండూరి రవి, అల్చెట్టి నాగన్న, షేక్ మన్సూర్, పూసం ప్రభాకర్, ఎం. ఏ కయ్యుమ్, దుర్గం శేఖర్, బండారి చిన్నయ్య, సయ్యద్ సుజాత్ అలీ మహిళా నాయకురాలు గైదానే లత, శ్రీలేఖ ఆదివాసీ, నేరెళ్ల లక్ష్మి, ప్రేమల, శారద, గంగామణి, ఉమా మహేశ్వరి, షబానా బేగంతోపాటు భారీ సంఖ్యలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Latest