Mahaa Daily Exclusive

  కృషిబాబు గారి అకాల మరణం తెలుగుదేశం పార్టీ కి తీరని లోటు – ఎమ్మెల్యే నరేంద్ర వర్మ

Share

బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ హైకోర్టు న్యాయవాది కామేపల్లి కృషి బాబు గారి పార్థివ దేహానికి తెలుగుదేశం పార్టీ జెండా కప్పి ఘన నివాళులర్పించి అనంతరం వారి అంతిమ యాత్రలో పాల్గొని ఖుషి బాబు గారి పాడే మోసిన బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ :-

కామేపల్లి ఖుషి బాబు గారి మరణం తెలుగుదేశం పార్టీ కి వ్యక్తిగతం గా తనకి తీరని లోటు అని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ గారు తెలియచేశారు. తెలుగుదేశం పార్టీ ఎ కార్యక్రమానికి పిలుపునిచ్చిన బాధ్యత గా తీసుకుని విజయవంతం చేయడం లో ముఖ్య పాత్ర పోసించే వారు అని అన్నారు. నరసాయపాలెం గ్రామ అభివృద్ది కి ఎంతో పాటు పడిన కృషి బాబు గారు ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అని అన్నారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేసారు.వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అని విధాల అండగా వుంటుంది అని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ ముప్పలనేని శ్రీనివాసరావు గారు, బిజెపి యార్లగడ్డ లక్ష్మీనారాయణ గారు, చారువాక గారు,తెలుగుదేశం పార్టీ నాయకులు మానం విజేతగారు మరియు తెలుగుదేశం,జనసేన,బిజెపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

Latest