Mahaa Daily Exclusive

  సచివాలయానికి తాళం.. బయట నిల్చున్న ఎంపీడీవో

Share

శ్రీహరిపురం సచివాలయాకి తాళం వేయడంతో బయట ఉన్న ఎంపీడీవో రమణప్రకాష్‌

తమ విధులు సక్రమంగా నిర్వహించకుండా విధులకు సక్రమంగా రాకుండా డుమ్మా కొడుతున్నారని ఎంపీడీవో రమణప్రకాష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మండలంలోని శ్రీహరిపురం సచివాలయాన్ని గురువారం సాయంత్రం 4.39 గంటలకు ఆయన తనిఖీ చేశారు. అప్పటికే తలుపు మూసివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేదేమీలేక ఆయన కార్యాలయం వెలుపల నిల్చుండిపోయారు. కొందరు ఉద్యోగులు ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారని, సమయపాలన పాటించాలని ఎన్నిసార్లు చెప్పినా వారిలో మార్పులేదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి కృషి చేస్తుంటే సచివాలయ సిబ్బంది ప్రభుత్వ లక్ష్యాలను నీరుగార్చడం చాలా విచారకరమని, ఇకపై సమయపాలన పాటించక పోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Latest