ఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు జవాన్లు మృతిచెందారు. బందిపూర్ జిల్లాలో శనివారం సదర్ కూట్ పాయెన్ సమీపంలోని ఓ వంపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఆర్మీ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు దుర్మరణం చెందారు. మరో ఐదుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Post Views: 51






