కోల్‌కతా: ప్రముఖ మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ కుమార్తె సనా గంగూలీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని డౌమండ్ హార్బర్‌లో శుక్రవారం సనా ప్రయాణిస్తున్న కారును వేగంగా వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి ఢీకొట్టింది. సనా తన కారులో బెహలా చౌరస్తాలో వెళ్తుండగా, కోల్‌కతా నుంచి రాయ్‌చక్ వెళ్తున్న బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ సమయంలో సనా డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నారు. అయితే ఈ ప్రమాదం నుంచి సనా, ఆమె డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారును ఢీకొట్టిన వెంటనే బస్సు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, కారు డ్రైవర్ దాన్ని వెంబడించి, కొంతదూరం వెళ్లిన తర్వాత ఆ బస్సును అడ్డగించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.







