హైదరాబాద్, మహా: రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. శనివారం వరంగల్ వెళ్తున్న సమయంలో ఆయన కాన్వాయ్ లోని పోలీస్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. జనగామ జిల్లా పెంబర్తి కళాతోరణం వద్ద ఈ ప్రమాదం చోటు జరిగింది. ఆ సమయంలో వాహనంలో ఉన్న ఎస్సై, డ్రైవర్ కు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రాణపాయం తప్పడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. సంబంధిత అధికారులు సంఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు.
Post Views: 48







