Mahaa Daily Exclusive

  నేడు సీసీ రోడ్ల ప్రారంభోత్సవం వివరాలు వెల్లడించిన మంత్రి సంధ్యారాణి

Share

విజయనగరం: సాలూరు నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లకు నేడు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన గ్రామాల్లో రోడ్లు నిర్మించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే రోడ్ల ప్రారంభోత్సవాలు చేస్తున్నామంటూ సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు, రోడ్లను అభివృద్ధి చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. నేడు మక్కువ మండలంలోని పలు గ్రామాల్లో నిర్మించిన 35 సీసీ రోడ్లు, సాలూరు మండలంలోని పలు గ్రామాల్లో 18 సీసీ రోడ్లు ప్రారంబించనున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. అలాగే 7న పాచిపెంట మండలంలోని పలు గ్రామాల్లో 27 సీసీ రోడ్లు, మద్యాహ్నం మెంటాడ మండలంలోని పలు గ్రామాల్లో 22 సీసీ రోడ్లు ప్రారంభించనున్నామని మంత్రి తెలిపారు.

Latest