దేశవ్యాప్తంగా ఆశా, అంగన్వాడి, మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని పిలుపులో భాగంగా ఏఐటియుసి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి డి ఆర్ ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రెడ్డి శ్రీనివాస డాంగే, కంకిపాటి బుచ్చిబాబు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా వేతనాలు పెంచలేదని పని భారం పెంచుతూ నిత్యం నిత్యావసర సరుకుల ధరలు, డీజిల్ , గ్యాస్ ధరలు పెంచుతుందేతప్ప కార్మికుల వేతనాలు మాత్రం పెంచడం లేదని అందుకే కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం కోసమే ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని తెలిపారు. అంగన్వాడీ, మధ్యాహ్నం భోజనం పథకం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గౌరవ వేతనాల బిల్లులు ప్రతి నెల 5వ తేదీ లోపు చెల్లించాలని, అంగన్వాడీ మినీ టీచర్లు అందరినీ మెయిన్ టీచర్లుగా గుర్తింపు ఇవ్వాలని మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు మెస్ చార్జీలు పెంచాలని, ఆశా వర్కర్లను అర్హతను బట్టి సెకండ్ ఏఎన్ఎం గా అవకాశం కల్పించాలని డాంగే, బుచ్చిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి తొర్లపాటి బాబు అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర సమితి సభ్యురాలు సైదా , జిల్లా కార్యదర్శి గంధం అంజమ్మ, నెల్సన్ అమ్మ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కరాటం సీతామహాలక్ష్మి, మిడ్ డే మిల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సుశీల, సుహాసిని తదితరులు పాల్గొన్నారు







