Mahaa Daily Exclusive

  అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండండి- మంత్రి నారా లోకేష్

Share

తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండి నియోజకవర్గ పర్యటనలో భాగంగా అమిరంలోని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు నివాసాన్ని మంత్రి లోకేష్ సోమవారం మధ్యాహ్నం సందర్శించారు.

ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన పార్టీ కార్యకర్తలతో లోకేష్ మాట్లాడుతూ… నాయకుల పర్యటనల్లో ఎటువంటి హంగు, ఆర్భాటాలు వద్దు, అహంకారం , విచ్చలవిడితనం ప్రజలు అంగీకరించరు. జగన్ హయంలో జరిగిన విధ్వంసం వలన రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగింది. నెలకి రూ.4 వేల కోట్ల లోటు బడ్జెట్ తో రాష్ట్రం నడుస్తుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పెన్షన్ ఒకే సారి వెయ్యి రూపాయిలు పెంచాం, దేశంలో అత్యధిక పెన్షన్ ఇస్తున్నది మనమే. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే అన్న క్యాంటీన్లు తెరిచాం, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం.ఇచ్చిన ప్రతి హామీ క్రమ పద్ధతిలో అమలుకు కృషిచేస్తున్నాం. మనల్ని ప్రశ్నించే హక్కు జగన్ కు లేదు.
సి పి ఎస్ రద్దు చేస్తానని జగన్ హ్యాండ్ ఇచ్చాడు, సంపూర్ణ మద్యపాన నిషేదం అని చెప్పి జె-బ్రాండ్లతో దోచుకున్నారు, తన పాలనా కాలంలో అమ్మ ఒడి మూడు ఏళ్లు మాత్రమే ఇచ్చాడు.
ఇవన్నీ మనం ప్రజలకు వివరించాలి. సంక్షేమ కార్యక్రమాలు అమలు, పెన్షన్ పంపిణీ లో కార్యకర్తలు భాగస్వామ్యం అవ్వాలి.

Latest