ఫార్ములా ఈ కారు రేసులో కీలక విషయాలు బయటపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. రేసు నిర్వహించిన గ్రీన్ కో సంస్థ ద్వారా బీఆర్ఎస్‌కు కోట్లాది రూపాయల లబ్ది చేకూరినట్టు వెల్లడించింది. ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకి రూ. 41 కోట్లు లబ్ది చేకూరినట్టు తేల్చింది. దీంతో ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది.
ఫార్ములా- ఈ రేస్ నిర్వహించిన గ్రీన్ కో కంపెనీ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కోట్లాది రూపాయల లబ్ధి చేకూరిందని తేల్చేసింది. బిఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ. 41 కోట్లు చెల్లించింది గ్రీన్ కో సంస్థ. బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు ఏకంగా 41 సార్లు ఎన్నికల బాండ్ల రూపంలో ముడుపులు చెల్లించింది. ఆ జాబితాను బయటపెట్టింది ప్రభుత్వం. రేస్‌కు సంబంధించిన చర్చలు మొదలైనప్పటి నుంచి బాండ్లను కొనుగోలు చేసింది గ్రీన్ కో సంస్థ. 2022 8 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 10 మధ్య ఆయా బాండ్లను కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రతిసారి కోటి విలువ చేసే బాండ్లు కొనుగోలు చేసింది గ్రీన్ కో కంపెనీ.







