హైదరాబాద్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేయనున్నట్టు ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ ప్రకటించింది. డిజిటల్ వ్యూహాన్ని పటిష్ఠం చేసుకుని మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలుగా 1,000కి పైగా నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపింది. లిల్లీ క్యాపబిలిటీ సెంటర్ ఇండియాగా (ఎల్‌సీసీఐ) వ్యవహరించే ఈ కేంద్రం ప్రపంచవ్యాప్తంగా తమ అవసరాలకు అనుగుణంగా ఆటోమేషన్, కృత్రిమ మేధ, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో తమ సామర్థ్యాలు విస్తరించేందుకు కృషి చేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది మధ్య కాలానికి ఈ జీసీసీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని పేర్కొంది. కాగా నియామకాల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపింది. ప్రస్తుతం కంపెనీ బెంగళూరులో ఒక ఎల్‌సీసీఐ నిర్వహిస్తోంది. ప్రపంచం ఎదుర్కొంటున్న అతి తీవ్రమైన ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలు చూపే ఆధునిక టెక్నాలజీలు, సాధనాలు తయారు చేయగల వివిధ రంగాలకు చెందిన ఇంజనీర్లను ఎల్‌సీసీఐ హైదరాబాద్ సమీకరిస్తుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డియోగో రౌ చెప్పారు
ఎలి లిల్లి హెల్త్ కేర్ రంగంలో పెట్టుబడులకు హైదరాబాద్ ను ఎంపిక చేసుకుంది. మంత్రి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు.







