అడ్వకేట్ ఉంటేనే విచారణకు వెళ్తానని అన్నారు.. అడ్వకేట్ కోసం కోర్టు మెట్లు కూడా ఎక్కారు. అయితే, ఎంతో ధైర్యంగా ఉంటుంది అని కేటీఆర్ భావిస్తే నిద్రపోయి ఆయననే షాక్ కు గురిచేశారు. చివరకు నిద్రపోతున్న ఆ అడ్వకేట్ ను కేటీఆర్ నిద్రలేపాల్సి వచ్చింది. కాగా, ఫార్మూలా ఈ-కార్ రేస్ కేసులో గురువారం కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. బంజారాహిల్స్ లోని ఏసీబీ ఆఫీసులో అధికారులు ఆయనను విచారించారు. ఈ విచారణకు కేటీఆర్ తన వెంట అడ్వకేట్ ను కూడా తీసుకెళ్లారు. ఇందుకోసం ఆయన హైకోర్టుకు వెళ్లి ప్రత్యేక పర్మిషన్ సైతం తెచ్చుకున్నారు. కానీ, ఆయనకు విచారణ సమయంలో ఆ అడ్వేకట్ నిద్రపోయి షాక్ గురి చేశారు. విచారణ మధ్యలో లంచ్ టైంకి బయటకు వచ్చిన కేటీఆర్.. మరో గదిలో ఉన్న తన అడ్వకేట్ దగ్గరకు వెళ్లారు. అప్పుడు ఆయన నిద్రపోతూ కనిపించారు. దీంతో ఆయనే స్వయంగా వెళ్లి ఆ అడ్వకేట్ ను నిద్రలేపాల్సి వచ్చింది. దీంతో, విచారణ సందర్భంగా ఏం జరుగుతుందో పరిశీలించాలని అడ్వకేట్ ను తన వెంట తీసుకెళ్తే విచారణ జరుగుతున్నంత సేపు ఆ అడ్వకేట్ నిద్రలోనే ఉండడంతో కేటీఆరే షాక్ అవ్వాల్సి వచ్చింది.







