Mahaa Daily Exclusive

  సీఎం రేవంత్ చెప్పినట్లే కింగ్ నాగ్ చేశారు….!

Share

తెలంగాణ టూరిజంను సెలబ్రిటీలు ప్రమోట్ చేయాలని.. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, సైబర్ క్రైమ్ వంటి వాటిపై అవగాహన కల్పించేలా వీడియోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సినీప్రముఖులకు సూచించారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఒక్కొక్కరు ఒక టాపిక్ తీసుకొని వీడియోలు విడుదల చేయగా.. తాజాగా, టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ జబర్దస్త్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సీఎం రేవంత్ చెప్పారు.. కింగ్ నాగ్ చేశారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు అభినందిస్తున్నారు. తెలంగాణలో ఉన్న టూరిజంను వివరిస్తూ చక్కటి వీడియోని కింగ్ నాగ్ విడుదల చేశారు. తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలు, టెంపుల్ టూరిజం, తెలంగాణ వంటకాలను ఆ వీడియోలో ప్రదర్శిస్తూ వివరించారు. తెలంగాణలో చూడదగ్గ ప్రదేశాలు, రుచి చూడాల్సిన వంటకాలు, దర్శించుకోవాల్సిన దేవాలయాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. తెలంగాణ టూరిజం శాఖ అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతా ఈ వీడియోను పోస్ట్ చేస్తూ నాగార్జునకు ధన్యవాదాలు తెలిపారు.

Latest